మద్దిరేవుల వంక సమీపంలో టిప్పర్ బోల్తా... డ్రైవర్, క్లీనర్ గాయాలు
రాయచోటి–చాగలమర్రి జాతీయ రహదారిలో మద్దిరేవుల వంక సమీపంలో సోమవారం ఉదయం ఓ ఇసుక టిప్పర్ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో టిప్పర్ అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.