కనిగిరి: రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనదారులకు సూచించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ వారియర్స్ తో కలిసి వాహనదారులకు శుక్రవారం కనిగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద డిఎస్పి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై డిఎస్పి వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహనతో మెలుగుతామని వాహనదారులతో డిఎస్పి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కనిగిరి ఎస్సై టి శ్రీరామ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.