నంద్యాల అర్బన్: వైయస్ జగన్ పై నంద్యాలలో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Jun 1, 2026
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నంద్యాలలో మంత్రి పార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు నంద్యాలలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం చేయడం వెనక పెద్ద కుట్ర కోణం దాగి ఉందన్నారు. పట్టపగలు ఒక వైసీపీ నాయకుడు విగ్రహం పగలగొడుతుంటే అక్కడ వైసిపి నాయకులు ఎవరు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. మీరే పగలగొట్టించి మీరే వీడియోలు సోషల్ మీడియా గ్రూపులో వేశారని ఆరోపించారు. జగన్ ఫస్ట్ నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడని అందులో భాగంగానే కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామాలు ఉన్నాయని తెలిపారు