చీమకుర్తి మండలంలోని బండ్లమూడి లో ఇటీవల జరిగిన దాడిలో గాయపడ్డ బాధితులను ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో MRPS రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ గురువారం పరామర్శించారు. అనంతరం డిఆర్ఓ ఓబులేసును వీరయ్య మాదిగ కలిశారు. బండ్లమూడి దాడిలో గాయపడ్డ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. తమకు ప్రభుత్వ సాయం కంటే దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించడమే ముఖ్యమని డిఆర్ఓ ఓబులేసు ను వీరయ్య మాదిగ కోరారు.