రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమం రద్దు : జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
సోమవారం రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నందున బందోబస్తు, తదితర విధుల దృష్ట్యా సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం(పోలీస్ కాన్ఫరెన్స్ హాలు)లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరు రాకూడదని సూచించారు.