మదనపల్లెలో భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినం
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నందు శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్యవైశ్యులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి విగ్రహానికి క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, పసుపు గంధాలతో అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.