ఒంగోలు అర్బన్: పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్టంగా పంపిణీ జరగాలి : సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి
Ongole Urban, Prakasam | May 5, 2026
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్టంగా పంపిణీ జరిగేలా చూడాలని సిసిఎల్ఎ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుండి రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం, పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం, రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ, తదితర అంశాలపై సిసిఎల్ఏ జయలక్ష్మి , రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ పాస్ పుస్తకాల పంపిణీ వేగంగా జరగాలన్నారు