ఆళ్లగడ్డ: అహోబిలంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహణ
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం వేద పండితులు శ్రీప్రహ్లాద వరద స్వామి, శ్రీ అమృతవల్లి అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులను పవిత్ర మాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు.