బనగానపల్లె: కోవెలకుంట్లలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా: జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల ప్రగతి పబ్లిక్ స్కూల్ ఆవరణలో మే 30న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. APSSDC ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రానున్నారు. పదో తరగతి, ఆపై చదువులు చదివిన అభ్యర్థులు అర్హులు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.