పట్టణంలో గుంతల రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె: రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం బనగానపల్లె మండలం గులభినబీపేటలో జరుగుతున్న గుంతల రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పకడ్బందీగా గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.