జహీరాబాద్: పస్తాపూర్ వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక నుండి హైదరాబాద్ వెళ్తున్న పల్సర్ బైకు పస్తాపూర్ ఫ్లైఓవర్ రోడ్డుపై అదుపుతప్పి కింద పడడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. గాయపడిన వారు బీదర్ కు చెందిన శ్రీకాంత్, మల్కాజ్గిరి కి చెందిన నందిని, శిరీష గా గుర్తించారు.