గుంతకల్లు: నాటుసారా జోలికి వెళ్లొద్దు, గుత్తిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన
నాటుసారా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ప్రాణాంతకమని ఎవరూ వాటి జోలికి వెళ్లరాదని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మన్రో సత్రం వద్ద శనివారం మద్యపానంపై సీఐ ఉమాదేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు మాట్లాడుతూ గుట్కా, జర్దా, నాటు సారా, గంజాయి లాంటి నిషేధిత మత్తు పదార్థాలు ప్రాణాంతకమని అన్నారు. నాటు సారా రవాణా, లేదా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.