ఉరవకొండ: బెలుగుప్ప ఎంపీపీ ని అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని కళ్యాణదుర్గం ఆర్ డి ఓ ను కలసి వినతి పత్రం అందజేసిన ఎంపీటీసీలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ఎంపీపీ పెద్దన్నను అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని బెలుగుప్ప మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం కళ్యాణ్ దుర్గం ఆర్డీవో వసంత బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ పెద్దన్న గ్రామాల అభివృద్ధికి సహకరించడం లేదని వైయస్సార్సీపి లో గెలచి టిడిపి పార్టీలోకి ఫిరాయించడం జరిగిందని ఎంపీటీసీ సభ్యులు పేర్కొన్నారు. మండలంలో మొత్తం 12 స్థానాల ఎంపీటీసీ సభ్యులకు గాను తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యుల సంతకాలతో ఆర్డిఓ కు వినతిపత్రం అందజేసిన అనంతరం బెలుగుప్ప మండల పరిషత్ కార్యాలయానికి సభ్యులు చేరుకున్నారు.