బనగానపల్లె: కోవెలకుంట్ల మండలంలో డ్రైనేజీ సమస్యపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం చిన్న కొప్పెర్ల, పెద్దకొప్పెర్ల గ్రామాల వద్ద రహదారిపై డ్రైనేజీ నీరు నిల్వ ఉండటంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేసి, రోడ్లపై మురుగునీరు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు తెలిపిన తాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.