వర్ని: అవినీతికి పాల్పడిన కోటగిరి విండో చైర్మన్ రాజీనామా చేయాలని మహాజనసభలో సభ్యుల డిమాండ్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటగిరి సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు వెంటనే రాజీనామా చేయాలని సహకార సంఘం మహాజనసభలో సభ్యులు రైతులు డిమాండ్ చేశారు. గురువారం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కోటగిరి సహకార సంఘం 82వ మహాజన సభ నిర్వహించారు. సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన సంఘ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని మహాజనసభలో రైతులు డిమాండ్ చేశారు సుమారు రెండు గంటల పాటు నిరసనలు బాదోపవాదాలు జరిగాయి. అనంతరం ఖరీఫ్ పంటకు తరుగు తీసుకోవద్దని ధాన్యం రవాణాకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు వసూలు చేయవద్దని గత ఖరీఫ్ పంట బోనస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానం చేశారు.