సూర్యాపేట: అంబరాన్నంటిన దసరా సంబురాలు.. సూర్యాపేట జమ్మిగడ్డలో జమ్మి చెట్టుకు ఘనంగా శమీపూజ
విజయదశమి వేడుకలను ఈరోజు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో జమ్మిగడ్డలో ఈరోజు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలపిట్ట దర్శనం చేసుకున్నారు.అలాగే, పోలీస్స్టేషన్లలో సిబ్బంది ఆయుధపూజ నిర్వహించారు.