జహీరాబాద్: రైల్వే స్టేషన్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన స్టేషన్ మాస్టర్ మాధవ్ కృష్ణ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్టేషన్ మాస్టర్ మాధవ్ కృష్ణ ప్రారంభించారు. ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డల నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.