గుంతకల్లు: మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన, క్యూ లైన్లు కిటకిట
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడవ శనివారం తో పాటుగా సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామి మూలమూర్తికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామి విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించి సింధూరం, తులసి, ఆకు పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి.