అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేర నివారణకు డ్రోన్ నిఘాను పెంచినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. రాయచోటి, రాజంపేట, మదనపల్లె సబ్ డివిజన్లలో పోలీసులు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.పట్టణాలు, శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, నేర ప్రోన్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పేకాట, గంజాయి వినియోగం, బహిరంగ మద్యం సేవనపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఓవర్స్పీడ్, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ వంటి రవాణా ఉల్లంఘనలపై దృఢ చర్యలు కొనసాగనున్నాయి.అనుమానాస్పద వ్యక్తులు, చర్యలు గమనిస్తే ప్రజలు వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్