కొందుర్గ్: కొందుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు
కొందుర్గ పోలీస్ స్టేషన్లో పరిధిలో ప్రభుత్వం నిషేధించిన 30 కిలోల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెట్రోలింగ్‌లో భాగంగా లూర్దు నగర్ కు వెళ్ళగా, నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారంతో గ్రామానికి చెందిన చలివిండ్ల లూర్దు రెడ్డి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఓ ప్లాస్టిక్ సంచిలో ప్రభుత్వం నిషేధించిన బీటి - 3 పత్తి విత్తనాలు దొరికాయి. దీనిపైన అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.