నేరేడుచర్ల: చిల్లేపల్లి పరిధిలోని కోదాడ -జడ్చర్ల హైవేపై ఉన్న టోల్ గేట్ వద్ద నేరేడుచర్ల అఖిల పక్ష పార్టీ శ్రేణులు నిరసన
నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి పరిధిలోని కోదాడ -జడ్చర్ల హైవేపై ఉన్న టోల్ గేట్ వద్ద నేరేడుచర్ల అఖిల పక్ష పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. టోల్ గేటుకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల వారికి టోల్ రుసుము మినహాయింపు ఉన్నా వసూలు చేస్తున్నారని వాపోయారు. గతంలో ఒకసారి ధర్నా చేపట్టగా మినహాయింపు ఇచ్చినట్లే ఇచ్చి, తిరిగి వసూలు చేయడం సరికాదన్నారు.