నందికోట్కూరు: మే నెలలో అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలని, సిఐటియు ఆధ్వర్యంలో, తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా వినతిపత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు అంగన్వాడీ సెంటర్లకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అంగన్వాడీ వర్కర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు, గురువారం నందికొట్కూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి లు ధర్నా నిర్వహించారు, ఎండ తీవ్రత వలన విద్యార్థులు అంగన్వాడి కేంద్రాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు, సెలవులు ఇవ్వాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు, డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు