కనిగిరి: పట్టణంలో మహిళపై విచక్షణ రహితంగా కత్తితో దాడి , ఆసుపత్రికి తరలించిన స్థానికులు
కనిగిరి: మహిళపై విచక్షణారహితంగా వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన కనిగిరి పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాయిబాబా థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న సుబ్బులు అనే మహిళ పూజ చేసుకుంటున్న సమయంలో ఇంట్లోకి వచ్చిన శివ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, వైద్యశాలలో గాయపడ్డ సుబ్బులు ను ఎస్ఐ శ్రీరామ్ విచారించి., కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.