అనంతపురం అర్బన్: కంబాలపల్లి లో పొలం కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 6, 2026
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కంబాలపల్లి లో పొలం కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో పొలంలో పనిచేస్తుండగా వీరన్న, రామచంద్ర, సన్నప పై దాడి చేశారు. వీరి ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.