తణుకు: UK ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివెనింగ్ స్కాలర్షిప్కు ఎంపికైన నవీన్‌కుమార్ ను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివెనింగ్ స్కాలర్ షిప్‌కు తణుకు 11వ వార్డుకు చెందిన ముళ్లపూడి నవీన్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నవీన్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో వెయ్యి మందిని ఎంపిక చేయగా భారత్‌కు 52 మంది కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నవీన్‌కుమార్ ఒక్కరే అన్నారు. భవిష్యత్తులో యువతకు నవీన్‌కుమార్ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.