డోన్: డోన్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు
Dhone, Nandyal | Jun 23, 2026 దేశం కోసం ధర్మం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి నాయకులు ఉన్నారు. మంగళవారం డోన్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు బక్రీద్ సుధాకర్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు నటరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు సన్న వెంకటరమణ అసెంబ్లీ బిజెపి నాయకులతో కలిసి మొదట శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి నేతలు పాల్గొన్నారు