అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్థానిక సన్ రైజర్స్ పాఠశాలల క్రీడా మైదానాల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 14, 17 విభాగాబాల్లో బాల బాలికల మండల స్థాయి చెస్,యోగ, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు బెలుగుప్ప మండల స్థాయి పోటీలు మరియు ఎంపికలు శనివారం జరిగాయి. ఈ పోటీలకు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలైన అంకంపల్లి, రామసాగరం, దుద్దేకుంట, బెలుగుప్ప, వెంకటాద్రి పల్లి, ప్రైవేట్ పాఠశాల సన్ రైజ్ స్కూల్ బెలుగుప్ప నుండి దాదాపుగా 70 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు కళ్యాణదుర్గం డివిజనల్ పోటీల్లో పాల్గొంటారు.