ఒంగోలు అర్బన్: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ట్రైనింగ్ ను ప్రారంభించిన మాస్టర్ ట్రైనర్
Ongole Urban, Prakasam | Jun 7, 2026
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జూన్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు యోగ పై మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ఆదివారం ప్రారంభించారు ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో 250 మందికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటూ శిక్షణ పొందుతున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ పై అవగాహన కల్పించడంతోపాటు దాని ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం అని తెలిపారు