నంద్యాల అర్బన్: నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం గదులను ప్రారంభించిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 15, 2026
నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ కేదారేశ్వరి దేవి అన్నదాన సత్రం ఐదు గదులను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి ఆయన కోటి రూపాయలు హామీ ఇచ్చినట్లు దేవస్థానం ఛైర్మన్ చలంబాబు తెలిపారు. మంత్రి ఫరూక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.