ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి మందుబాబులతో శుభ్రం చేయించిన పోలీసులు
Ongole Urban, Prakasam | May 6, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి బుధవారం పోలీసులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. కొన్ని ప్రాంతాలలో మద్యం తాగుతున్నవారు పట్టు పడగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మందలించి జరిమానా విధించారు. అంతేకాకుండా వారితోను ఆ ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించినట్లు సిబ్బంది తెలిపారు.