అదిలాబాద్ అర్బన్: విదేశాల్లో ఉంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టేల పోస్టులు పెట్టిన ఒకరి అరెస్టు :వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ
విదేశాలలో ఉంటూ పోలీసులను అవమానపరిచే విధంగా వాట్సాప్ గ్రూప్ పోస్టులు పెడుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. గురువారం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... షేక్ ఇర్ఫాన్ ను ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కు చెందిన షేక్ ఇర్ఫాన్ విదేశాల్లో ఉంటూ 'సిల్సిలా' అనే వాట్సాప్ గ్రూపు అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక కేసు విషయంలో పోలీసు అధికారులను అవమానించేలా పోస్ట్ పెట్టడంతో కేసు నమోదు చేశామన్నారు