నంద్యాల జిల్లా డోన్‌లో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో సీసీ, ఎక్సైజ్, ఎస్టీసీ, ఓఎస్ వంటి మొత్తం 1023 కేసులు ఇరు పక్షాల రాజీతో పరిష్కారమయ్యాయని న్యాయమూర్తులు తెలియజేశారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమన్నారు.