భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బుధవారం నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడంపై నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా నాయుడుపేట నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి సమగ్రమైన, సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే గొప్ప రాజ్యాంగమని