హిమాయత్ నగర్: 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం : బీసీ సంఘం చైర్మన్ ఆర్ కృష్ణయ్య
ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తామని రాష్ట్ర బీసీ సంఘం ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు హైదరాబాద్ పట్టణంలోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు హాజరై మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలు జరగనివ్వమంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు.