మాయలూరు లో మగ శిశువు లభ్యం: శిశు దత్తత కేంద్రానికి తరలింపు
నంద్యాల జిల్లా మాయలూరు లో పాడుబడిన గృహంలో ఆదివారం లభ్యమైన మగ శిశువును ఉయ్యాలవాడ మండలం అంగన్వాడీ కార్యకర్తలు నంద్యాలలోని శిశు దత్తత కేంద్రంలో సోమవారం అప్పగించారు, నంద్యాల మండలం కొండాపురంలోని శిశు దత్తత కేంద్రంలో ఏఎన్ఎం జయలక్ష్మికి చిన్నారిని అందజేశారు, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించే శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు