ఆందోల్: జోగిపేట తహసిల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన
సంగారెడ్డి జిల్లా జోగిపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట గత నెల 30న ఇవం పేట వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న జోగిపేటకు చెందిన యూట్యూబ్ లోకేష్ చంద్ర మృతదేహంతో కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా నిర్వహించారు. నిన్న వెండికోలు శివారులో మృతదేహం లభ్యం అయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు జోగిపేటకు తీసుకువచ్చి ధర్నా చేశారు. లోకేష్ మృతికి జోగిపేటకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని వారి తల్లి అల్లే ప్రమీల ఆవేదన వ్యక్తం చేసింది.