రాజేంద్రనగర్: ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలంటూ చందానగర్ లో ఏబీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించడం లేదంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఇందుకు నిరసనగా చందానగర్లో రాస్తారోకో చేపట్టారు. ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమని, విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులకు ఆరోపించారు.