ఒంగోలు అర్బన్: ఒంగోలు అగ్ని ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారిస్తున్నాం: వన్ టౌన్ సిఐ నాగరాజు
Ongole Urban, Prakasam | Apr 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గద్దలగుంట నందు మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు వెంకటరమణమ్మ సజీవ దహనమయ్యారు దీనిపై చుట్టుపక్కల వారు కుమారుడే చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా సిఐ నాగరాజు తెలియజేశారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రిమ్స్కు తరలించినట్లుగా తెలిపారు పోస్టుమార్టం అనంతరం ఆమె మృతికి గల కారణాలను తెలుసుకొని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు మృతురాలకు ఇద్దరు కుమారులు ఉన్నారని పెద్ద కుమారుడు మృతురాలు కలిసి ఉంటారని తెలిపారు చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తుంటాడని తెలియజేశారు