కర్నూలు: కరోనాలో తొలగించిన 11మంది ఆర్టీసీ స్వీపర్స్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి – సిఐటియు నగర అధ్యక్షుడు నగేష్
కరోనా సమయంలో తొలగించిన ఆర్టీసీ స్వీపర్స్లో మిగిలిన 11మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఆర్టీసీ రాయలసీమ రీజన్ చైర్మన్ పూల నాగరాజు, ఎంపీ బస్తిపాటి నాగరాజును సిఐటియు నగర అధ్యక్షుడు నగేష్, కోశాధికారి సాయిబాబా, స్వీపర్స్ యూనియన్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.ఆర్టీసీలో గతంలో 43మంది స్వీపర్స్ పనిచేస్తుండగా, కరోనా కారణంగా పని తగ్గిందని పలువురిని తొలగించారని తెలిపారు. పలుమార్లు విన్నవించడంతో కొంతమందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ ఇంకా 11మంది పనిలోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో వెంటనే ఆర్ఎంకు ప్రపోజల్ పంపాలని చైర్మన్ అధికారులకు ఆ