ఎం.మాకవరం సచివాలయానికి వ్యవసాయ సిబ్బందిని నియమించాలని కొయ్యూరులో ఏవోకు వినతిపత్రం
కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం గ్రామ సచివాలయానికి వ్యవసాయ సిబ్బందిని నియమించాలని పంచాయతీ సర్పంచ్ కోడా చింతల్లి రాజుబాబు, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు పీ.మోహన్ తదితరులు కోరారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ఏవో బీ.రాజ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన వీహెచ్ఏ సంధ్యారాణి ఇటీవల కొమ్మిక బదిలీపై వెళ్లారన్నారు. దీంతో రైతులకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. ఈమేరకు వ్యవసాయ సిబ్బందిని నియమించాలని కోరారు.