బనగానపల్లె: ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కొలిమిగుండ్లలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామేశ్వరరెడ్డి
కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొలిమిగుండ్ల మండలం నందిపాడులో క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి ప్రకాశెడ్డితో కలిసి నంద్యాల రామేశ్వర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు