నంద్యాల అర్బన్: నంద్యాలలో విషాదం,కేసీ కెనాల్ లో ఓ బాలుడు గల్లంతు
Nandyal Urban, Nandyal | Apr 10, 2026
నంద్యాల పొన్నాపురం కేసీ కెనాల్ వద్ద చేపల వేటకు వెళ్లిన దేవనగర్కు చెందిన సోహెల్ (15) ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చీకటిలోనే టార్చిలైట్ల సాయంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.