రామారెడ్డి: స్కూల్ తండా పెరట్లో గంజాయి మొక్కలు స్వాధీనం, కేసు నమోదు : ఎస్సై లావణ్య
రామారెడ్డి మండలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. లావణ్య ఆధ్వర్యంలో సిబ్బంది, పంచులు, వ్యవసాయ అధికారులతో కలసి సాయంత్రం 5 గంటల సమయంలో స్కూల్ తండా గ్రామంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. గంగవత్ రాజేందర్ అనే వ్యక్తిగత తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు (ఎత్తు 3–6 అడుగులు) సాగు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, గంజాయి మోకాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లావణ్య పేర్కొన్నారు.