నంద్యాల అర్బన్: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటేషన్ ఉద్యోగుల ఆందోళన
Nandyal Urban, Nandyal | Jun 9, 2026
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటేషన్ వర్కర్లు మంగళవారం ఆందోళనలకు దిగారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క రాయలసీమ జోలిలో మాత్రమే 50 సంవత్సరాల వయసు నిబంధన విధించారని, అలాగే పద్మావతి ఏజెన్సీ వారు అన్యాయంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 13 మంది వర్కర్లను తీసివేశారని వారి జీవితాలు ఇప్పుడు రోడ్డుపై పడ్డాయని తెలిపారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు