యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఓయూ పరిధిలోని మాణికేశ్వరీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట కుమార్ పిలుపునిచ్చారు. తార్నాకలో ‘సే నో టు డ్రగ్స్' నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి, మద్యానికి బానిసలై జీవితాలను చిధ్రం చేసుకోవద్దని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున యువకులు పాల్గొని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు