డోన్: డోన్ జాతీయ రహదారిపై దొంగ డాక్యుమెంట్లతో నడుస్తున్న క్రైన్
Dhone, Nandyal | May 14, 2026 నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో దొంగ డాక్యుమెంట్లతో ఉన్న ఒక క్రేన్ను సీజ్ చేశారు. పట్టణ, రూరల్ సీఐలు, ఎంవీఐ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలకు రూ. లక్ష జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.