రాజేంద్రనగర్: షాద్నగర్లో గొర్రెలు మేకల దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
గొర్రెలు, మేకల దొంగల ముఠాను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు.. పరిగి, కర్ణాటక, HYDలోని పలు ప్రాంతాలకు చెందిన ముఠా కార్లలో తిరుగుతూ మేకలు ఎక్కడున్నాయో వెతికి డీసీఎంలో తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు