బనగానపల్లె: పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం పెద్దపీట :బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా సంజామల మండల పరిధిలోని ముదిగేడులో సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లను అధికారులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకొని వారితో ముచ్చటించారు. పింఛన్ల పంపిణీకి CM చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి బీసీ కొనియాడారు.