నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jul 5, 2025
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం పలు కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొన్నారు. మొదటగా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్తల రాదాడు పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పోటీలకు వచ్చినటువంటి వారికి అన్ని రకాల వస్తువులను కూడా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కందుకూరులో ప్రకాశం కళాశాల అధినేత కంచర్ల రామయ్య దర్శన కర్మలో పాల్గొని నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన సానుభూతిని తెలిపారు. సాయంత్రం ప్రకాశం భవనంలో మెప్మాలకు ట్యాబ్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ట్యాబులను పంపిణీ చేశారు