కరీంనగర్: గత ప్రభుత్వంలో శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి పోన్నం ప్రభాకర్
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో గిరిజన వసతి గృహ భవనానికి గురువారం మంత్రి పోన్నం ప్రభాకర్, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు. సుమారు అంచనా వ్యయం 20 కోట్లతో గిరిజన విద్యార్థిని , విద్యార్థుల కోసం నూతనంగా వసతి గృహం నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి విద్యార్థి ల సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రులు అన్నారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత శాతవాహన యూనివర్సిటీ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని భావించాం, కానీ గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైందని, ఆనాడు మేము చేసిన అభివృద్ధి తప్ప ఏమి చేయలేదని అన్నారు.